వెనక్కు తగ్గిన కవిత.. బెయిల్ పిటిషన్ ఉపసంహరణ..

ఢిల్లీ మద్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ ..డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని వాదనల సందర్భంగా సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు జులై 22వ తేదీన ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

 

ఈ నెల 9వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ జరపనుంది. చట్ట ప్రకారం తనకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదలనలు జరపాల్సి ఉండగా వాదలను వినిపించాల్సిన న్యాయవాదులు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కోరారు. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేసిన రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి, పిటిషన్‌పై తుది విచారణ బుధవారం జరపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *