న్యూఢిల్లీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే ఓ.ఎస్.డి గారికి తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుట కోసం 108 కోట్ల రూపాయలను నిధులను కేటాయించాలని విజ్ఞప్తి పత్రాన్ని అందజేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. ఇట్టి తరుణంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతుతో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుట కోసం ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు 108 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని సభాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, దామోదర్ రాజనర్సింహ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడంలో ఎప్పుడు ముందుంటారని అవినీతిపరులకు తగిన బుద్ధి చెప్తారని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సాధించి చరిత్రలో నిలిచే వ్యక్తులుగా నిలుస్తారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం పోరాడుతున్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.