స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీ, హోం మినిస్టర్ అమిత్ షా కార్యాలయాన్ని స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఆశ్రయించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.శివకుమార్, రక్ష బీసీ రక్షక్ దళం చైర్మన్ ఎం. ఉదయ్ కుమార్, బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. ఈ సందర్భంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ గారికి కేటాయించిన పది ఎకరాల స్థలంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడం కోసం పటిష్టంగా రూపొందించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, సంస్కృతిని కాపాడుతూ ముందుకు సాగుతుందని ఇట్టి విషయంలో కేంద్ర ప్రభుత్వం 108 కోట్ల రూపాయల నిధులను ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాలుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గత ప్రభుత్వంలో కొనసాగిన అవినీతికి పాల్పడ్డ నాయకులకు చట్టబద్ధమైన శిక్ష విధించి దేశద్రోహులుగా గుర్తించి జీవిత యావగార శిక్ష విధించే విధంగా కొత్త చట్టాలను రూపొందించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్యలో అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *