నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి డాక్యుమెంటరీలో బహుబలి మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బహుబలి మూవీలోని భళ్లాలదేవుడి పాత్ర కోసం ముందుగా హాలీవుడ్ స్టార్ జేసన్ మమోవాను అనుకున్నారట. అయితే ఆ తర్వాత నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి కథ చెప్పారట. ‘నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు’ అని రానా అడగటంతో జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో రానా కూడా నవ్వేసి ఒకే చెప్పినట్లు తెలిపారు.