ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాలోని సెకండ్ సింగిల్‌ను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ చూస్టుంటే.. ఇది రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.