మణిపూర్ అల్లర్ల మూల్యం రూ.500 కోట్లు..!

మణిపూర్ లో అల్లర్లు, హింసాత్మక చర్యలు మొదలై సంవత్సర కాలం దాటింది. ఈ అల్లర్లలో వందలాది మంది మృతి చెందారు. వేల సంఖ్యలో శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటున్నారు నేటికీ. మైతీల రిజర్వేషన్ అంశంపై రాజుకున్న అగ్గి దావానలమై దహించివేస్తోంది మణిపూర్ ను మైతీలు కుకీల మధ్య రాజుకున్న రిజర్వేషన్ల అంశం చివరికి రాజకీయ రంగును పులుముకుంది. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ నేతలు మణిపూర్ గొడవలపై తప్పు మీదంటే మీదని ఒకరిపై మరొకరు నిందారోపణలతో మణిపూర్ అల్లర్లకు మరింత ఆజ్యం పోశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో మణిపూర్ లో జరిిన హంస, అల్లర్లకు రెండు వందల ఇరవై ఆరు మంది మృతి చెందారని ఆ రాష్ట్ర సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. అలాగే నాలుగువేల

 

దెబ్బతిన్న ఇళ్లు, పంటపొలాలు

 

ఐదు వందల అరవై తొమ్మిది ఇండ్లు విధ్వంసానికి గురయ్యాయని తెలిపారు. ఇండ్లే కాదు పంట పొలాలు సైతం దుండగులు ధ్వంసం చేశారు. అయితే హింసాత్మక చర్యలపై ఈ ఆర్థిక సంవత్సరం ఉక్కు పాదం నెలకొల్పుతామని సీఎం బిరేన్ సింగ్ తెలిపారు. ఇప్పటిదాకా నష్టపోయింది చాలు అన్నారు. గతేడాది ఈ అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ పర్యాటకం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. అలాగే రూ500 కోట్ల మేరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేశామని అన్నారు.

 

పోలీసు యంత్రాంగం పటిష్టం

 

మణిపూర్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లర్లు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో నిఘా పెంచాలని..హద్దు మీరి ప్రవర్తించేవారిపై ఇక కఠిన చర్యలు తీసుకుంటామని..ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అందుకే పోలీసు భద్రత కోసం రెండు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్ లో కేటాయించామని అన్నారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో మణిపూర్ ప్రాంతాన్ని మళ్లీ మామూలు స్థాయికి తెస్తామని..శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు చేస్తామని తెలిపారు. జనాభాలో 53 శాతం కుకీలు ఉన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో తాము పూర్తిగా నష్టపోయామని అంటున్నారు. తమ ఆస్తులు, సర్వస్వం కోల్పోయామని వాపోతున్నారు. మళ్లీ మేము ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *