కేసీఆర్‌కు భారీ షాక్.. ప్రతిపక్ష హోదా ఔట్..?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అధికార పక్షం సభ్యులు.. ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ ప్రస్తుత అధికారపక్ష సభ్యులు.. ఇలా మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వాడివేడిగా జరుగుతున్నది.

 

కాగా, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అసెంబ్లీకి రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ నిలదీశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ ఆయన చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శలు సరికాదంటూ ఆయన విమర్శించారు.

 

గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ను గత యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్‌ను కేటాయించినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ సభకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తే.. కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదంటున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీకి రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు..? ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కాకుండా వేరేవారు తీసుకోవొచ్చు కదా? అంటూ సలహా ఇచ్చారు. విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో ఉపయోగం లేదని ఆనాడే చెప్పానన్నారు. ఈ ప్లాంట్ పూర్తయ్యేందుకు అదనంగా రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. డబ్బులు పోయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తికాలేదని ఆయన చెప్పారు. రామగుండంలో పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నా.. అక్కడ ఏర్పాటు చేయకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించినట్టు అంటూ ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *