సీఎం చంద్రబాబుకు షర్మిల ప్రశ్నలు..! ఇదెక్కడి న్యాయం..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అధికార-విపక్షాల బాణాలు సంధిస్తున్నారు. ఆదివారం వైసీపీ అధినేత జగన్‌ కాగా, ఇప్పుడు సీఎం చంద్రబాబు వంతైంది. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. మూడువారాలుగా గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ఇళ్లు, పంట లు నీట మునిగి.. రైతులు అర్తనాదాలు చేస్తున్నారు. అయినా, మీ నీతి ఆయోగ్ మీటింగ్ ముగియ లేదా సీఎం గారూ అంటూ ప్రశ్నించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కరుస్తున్నాయి. సోమవారానికి రెండువారాలు దాటింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు పంటలు, పల్లెలు నీటమునిగి రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అన్నారు.

 

ఇప్పటికీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు? అంటూ ప్రశ్నించారు. రైతులు, ప్రజలు కొట్టుకుపోతున్నారని, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ కోనసీమ వరద నీటిలో చిక్కు కుందన్నారు. సాయం మీద స్పష్టత ఏది అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. బీహార్‌కు వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలను బీజేపీ సాయం చేసిందని, ఏపీకి ఎందుకు ఇవ్వలేదన్నారు వైఎస్ షర్మిల.

 

ఏపీ పట్ల కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా? మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరదసాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేక పోతున్నారు? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత రాలేదా అంటూ తనదైనశైలిలో ప్రశ్నించారు.

 

రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు వైఎస్ షర్మిల. ప్రతీరైతు ఎకరానికి రూ.15000 రూపాయలు ఖర్చుపెట్టారని, ఆస్తి నష్టం కూడా జరిగిందన్నారు. మొత్తం నష్టం కలిపి సుమారు రూ.800 కోట్లగా అంచనా వేశారు.

 

భారీగా పంట నాశనం అయితే ఆదుకోవాల్సిన సర్కారు మీరు కాదా? రైతన్న కష్టాన్ని వివరించామని, మా నిబద్ధతలో మీకు పావు వంతు ఉన్నా మీ సర్కారు ఈ నిర్లక్ష్యం చూపదన్నారు. వెంటనే వరద ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రెండురోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లాలో వరద ప్రాంతాలను పర్యటించారు వైఎస్ షర్మిల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *