ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ అరుదైన పాము పేరు ‘సలజర్స్ పిట్ వైపర్’. ‘సలజర్ స్లితరిన్’ అనేది హ్యారీపోటర్ సినిమాలోని ఓ క్యారెక్టర్. సలజర్ క్యారెక్టర్‌ను పోలి ఉన్న కారణంగా ఈ పాముకు ఆ పేరు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కు చెందిన జీసన్ ఏ అయాజ్ మిర్జా, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన హర్షల్ ఎస్ బోషలే, మరో ఇద్దరు దీన్ని కనుగొన్నారు.