శాఖాహారంతో శాంతికి మార్గం- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా శాకాహార ర్యాలీ రాజీవ్ పార్క్ న్యూ బస్టాండ్ నుండి మొదలై విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రముఖ ప్రముఖ మేధావుల గురువుల మరియు పిరమిడ్ ధ్యానులతో సమావేశమై శాఖాహారం యొక్క విశిష్టతను మేధావులు, వక్తలు,గురువులు మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. తదనంతరం గురువులను మేధావులను వక్తలను శాలువాలతో ఘనంగా ఉమ్మడి మెదక్ పిరమిడ్ మాస్టర్లు సన్మానించారు. అందులో భాగంగా పత్రీజీ గారి ఆశయాలను దృష్టిలో ఉంచుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు మహాత్ముల యొక్క బాటను అనుసరిస్తూ, గురువుల యొక్క బాటను అనుసరిస్తూ ఈ యొక్క భారతదేశంలో మానవ దేహం దేవాలయం లాంటిదని అట్టి దేవాలయం ఆత్మ పరమాత్మతో కూడినదని అట్టి జ్ఞానాన్ని మానవుడు తెలుసుకున్న నాడే నిజమైన జీవన విధాన మార్గాన్ని అనుసరిస్తున్నాడని, తద్ మార్గం ధ్యానమార్గం ద్వారానే సాధ్యమని తెలియజేస్తూ మనిషి పుట్టుకతోనే జీవన విధానం శాకాహార జీవన విధానం అని గొప్ప గొప్ప మేధావులు, గురువులు, మరియు పిరమిడ్ మాస్టర్లు తెలియపరిచిన మాటలను పునరావృతం చేస్తూ శాఖాహార సభలో ఉన్నటువంటి ధ్యానులకు తెలియజేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పీఠాధిపతులు వట్టిపల్లి గురువు శివమణి గారు, శ్రీవిద్య ఉపాసకుడు సంజీవ్ మహారాజ్ గారు, బ్రహ్మకుమారిస్ అక్కయ్య సుమంగళ సుకన్య, ఇతర పీఠాధిపతుల తో పాటు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ మాస్టర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ కుమార్ గారు, మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారు, సభ నిర్వాహక అధ్యక్షులు సంగమేశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, మెదక్ పిరమిడ్ పార్టీ కాంటెస్టెడ్ ఎంపీ సాయి గౌడ్, బోధన్ సాయిలు మాస్టర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇంచార్జ్ కరాటే మాస్టర్ అశోక్, సంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్ దత్తు మాస్టర్, నారాయణఖేడ్ ధ్యాన కేంద్ర ఇంచార్జ్ విఠలాచారి, పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ సుజాత గంగారెడ్డి, సేవాదళ్ అధ్యక్షులు భూపతి రాజుగారు, సినీ ఫైటర్ మౌన స్వామి సిద్దిపేట నరసింహులు గౌడ్, సైదులు మాస్టర్, పిరమిడ్ మాస్టర్లు రాఘవరెడ్డి, కృష్ణ మాస్టర్ మరియు అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *