సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో హైదరాబాద్ గార్డెన్ ఫంక్షనల్ లో 28న జరగబోవు శాఖాహార ర్యాలీ సభను ఉద్దేశించి నిర్వహించిన సభలో
బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మెగా శాకాహార ర్యాలీలో భాగంగా మొట్టమొదటి మెగా శాకాహార ర్యాలీ ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ ధ్యానుల ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం తేదీ 28వ రోజున ఉదయం 9:30 కు కొత్త బస్టాండ్ పక్కన రాజీవ్ మున్సిపల్ పార్క్ నుండి 5000ల మందితో మెగా శాఖాహార ర్యాలీ నిర్వహించబడుతుందని తెలియజేశారు.ఈయొక్క శాఖాహార ర్యాలీకి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు, మరియు మహేశ్వరం పిరమిడ్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, ట్రస్ట్ మెంబర్ దామోదర్ రెడ్డి పాల్గొంటున్నారు. కావున ఈ యొక్క మెగా శాఖాహార ర్యాలీ కార్యక్రమానికి శాఖాహారులు, ధ్యాన ప్రచారకులు, పిరమిడ్ ధ్యానులు మరియ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సకాలంలో హాజరై మెగా శాఖాహార ర్యాలీని విజయవంతం చేయాలని పేరుపేరునా కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ పిరమిడ్ పార్టీ కాంటెస్టెడ్ ఎంపీ సాయి గౌడ్, బోధన్ సాయిలు మాస్టర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇంచార్జ్ కరాటే మాస్టర్ అశోక్, సంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్ దత్తు మాస్టర్, నారాయణఖేడ్ ధ్యాన కేంద్ర ఇంచార్జ్ విఠలాచారి, పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ సుజాత గంగారెడ్డి, మరియు అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు.