సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలో ఈ కలియుగంలో ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ స్వామివారిని మనసులో వేడుకుంటూ తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా దర్శనం ఇచ్చినట్టు అనిపించిందని తెలియజేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.