ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులకు దూరం పెడుతున్నారు. సీనియర్ అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇప్పటికే సీఎం పేషీ, ఆర్థికశాఖ ఇలా ఏశాఖ చూచినా కొత్త అధికారులు దర్శనమిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వంతైంది. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. శాసనసభ కార్యాలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఆయన బాధ్యత లు స్వీకరించారు.