అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసిన ఈ చిత్రం ఇప్పటివరకూ ఓటీటీలో విడుదల కాలేదు. విడుదలైన మూడు వారాలకే సినిమాను ఓటీటీ విడుదల చేస్తున్నట్లు స్ట్రీమింగ్ వేదిక సోనీలివ్ గతంలో తెలిపింది. ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్ జులై 28వ తేదీ రాత్రి 8గంటలకు ఈ మూవీని ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.