ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ప్రస్తుతం దీని మూడో సీజన్ ‘మీర్జాపూర్ 3’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తాజాగా దీని నాలుగో భాగంపై బాలీవుడ్ నటి షెర్నావాజ్ జిజినా మాట్లాడారు. ‘ప్రస్తుతం ‘మీర్జాపూర్ 4’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాలుగో సీజన్ మీ ఊహకు మించి ఉంటుంది‘ అని తెలిపారు.