హత్రాస్ తొక్కిసలాట కేసు విచారణ..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..!

హత్రాస్ తొక్కిసలాట ఘటనపై దాఖలైన పిటిషన్‌‌‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ విచారణ కోసం సోమవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నెల 2వ తేదీన హత్రాస్ భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి సుమారు 120కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు రిటైర్ట్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

 

న్యాయవాది విశాల్ తివారీ మాట్లాడుతూ.. హత్రాస్ తొక్కిసలాట ఫటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. జాబితా చేసేందుకు కోర్టు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే విచారణ జరుగుతుందని తెలిపారు. తాము కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశామని.. రిటైర్ట్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందులో మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారు. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి సత్సంగ్‌కు వచ్చారు. వాహనాల సంఖ్య మూడు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది.

 

సత్సంగ్ ముగిసిన తర్వాత భోలే బాబా పాదధూళిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. భత్రత కల్పించడంలో నిర్వాహకులు, పోలీసుల వైఫ్యం చెందారనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురిని అరెస్ట్ చేశారు.

 

హత్రాస్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది. నివేదికను యూపీ ప్రభుత్వానికి సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్ నివేదికలో పేర్కొంది. తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇతర సాక్ష్యాల ఆధారంగా ప్రమాదానికి.. ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వహణ లోపమే కారణమని తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారు. అంతే కాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించలేదు.

 

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరైనా వారికి కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ లేకుండానే కార్యక్రమం నిర్వహించారు. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. రద్దీ ఎక్కువగా ఉన్నా వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరగగానే కమిటీలోని సభ్యులు అక్కడి నుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో వెల్లడించింది.

పోలీస్ యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని సిట్ తెలిపింది. సత్సంగ్ జరిగే వేదిక ప్రాంగణాన్ని తనిఖీ చేయకపోగా కనీసం సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సబ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారని తెలిపింది.

 

సర్కిల్ ఆఫీసర్, రెవెన్యూ అధికారి, ఇన్స్పెక్టర్ ఇంఛార్జ్, అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెల్లడించింది, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది, అయితే ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా తాము కొట్టిపారేయలేమని దానిపై సమగ్ర విచారణ జరుగుతుందని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్యకర్తలతో పాటు మరో నలుగురిని మంగళవారం సస్పెండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *