తెలంగాణలో గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు..!

తెలంగాణలో గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్ధిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్ పోర్టు లతో సహా డేటా కావాలని కోరింది. ఇదిలా ఉంటే ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.

 

ఈడీ, ఏసీబీ లేఖలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారిగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ. 1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారిగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.

 

ఏసీబీ తాజాగా గొర్రెల స్కాం కేసులో ఇద్దరు అధికారులను కూడా అరెస్టు చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందని రంగంలోకి దిగిన ఏసీబీ ఈక్రమంలోనే సమాచారం సేకరించి లోతైన దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు తెలంగాణ పశుసంవర్ధక సీఈఓ సభావత్ రాంచందర్ తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను అరెస్ట్ చేసింది. గొర్రెల స్కాంలో రామచందర్ కళ్యాణ్ నిందితుడిగా ఉన్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈక్రమంలోనే వారిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో కూడా హాజరు పరిచారు.

 

ఈ స్కాంలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కామారెడ్డి వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మెడికల్ పశు సంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ లను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించింది. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడి ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి పథకం నిధులను తరలించినట్లు దర్యాప్తులో తేలింది.

 

2015 జూన్ 20న మాజీ సీఎం కేసీఆర్ 12 వేల కోట్ల బడ్జెట్‌తో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొండపాకలో ఈ పథకాన్ని మొదలు పెట్టారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలకు గాను ఒక లక్షా 25 వేల ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను లక్షా 75 వేలకు పెంచారు. గొర్రెల పంపిణీ పథకంపై ఆరోపణలు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే పలువురిని అరెస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *