సీఎం రేవంత్ కొత్త ఆలోచన, యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ..!

తన మార్క్ పాలన సాగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజలకు అవసర మైన వాటి విషయంలో వెనక్కి తగ్గలేదు. తెలంగాణలో ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో కాస్త వెనుకబడుతున్నారు. దీన్ని గమనించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగా ఫోకస్ చేశారు.

 

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పాలని ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడారు. ఈనెల 23లోపు నివేదిక సమర్పించాలని విద్యా, పరిశ్రమల అధికారులను ఆదేశించారు. అంతా అనుకున్నట్లు జరిగితే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశముంది. స్కిల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులతో మాట్లాడారు. ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో అయితే బాగుంటుందన్నది ప్లాన్.

 

సోమవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో పారిశ్రామికరంగ ప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలు, అధికారుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేకాదు ఐఎస్‌బీ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టాలా? లేక ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలా? పీపీపీ విధానం అనుసరించాలా? అనేదానిపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

 

యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసేందుకు నిపుణులైన ఓ కన్సల్టెంట్‌ను నియమించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. దాదాపు పావుగంటకు పైగానే అక్కడే తిరిగి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *