తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి శుభపరిణామం అని వెంకయ్యనాయుడు తనదైన శైలిలో అభివర్ణించారు. ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
అంతేకాదు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు సమయస్పూర్తితో ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఏపీ, తెలంగాణ సీఎంల భేటీపై రెండు రాష్ట్రాల ప్రజలు మంచి శుభపరిణామం అని, తెలుగు రాష్ట్రాల అభివృధ్ధి, అభ్యున్నతికి పాటుపడాలని ఇరువురిని కోరుతున్నారు.
అంతేకాకుండా ఇరు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి విషయంలోనూ పోటీ పడాలని రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను కలుసుకోవడం తెలంగాణలోనూ పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఆ పార్టీ తెలంగాణలో పుంజుకోనుందా లేదా అనేది లోకల్ ఎన్నికల్లో తేలిపోనుందంటూ కొందరి నేతల అభిప్రాయం.