ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం..!

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటలకు అధికారులు ప్రారంభించారు. స్టాక్ పాయింట్ల ద్వారా అందుబాటులో ఉన్న ఇసుకను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుకల నిల్వ ఉంది. మరో 3 నెలల్లో కోటి టన్నుల ఇసుకను అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

ఉచిత ఇసుక విధానం ముందుగా 20 జిల్లాల్లోని 120 స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను పంపిణీ చేయనున్నారు. ఒక్కో వినియోగదారుడికి గరిష్టంగా 20 టన్నల ఇసుకను సరఫరా చేయనున్నారు. ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాగులు వంకల్లోని ఇసుకను ఎడ్లబండిలో తీసుకెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

 

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు కోసం సీఎస్ నీరబ్ కుమార్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు, జేసీకేసీ, ప్రతిబబ ఇన్ ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు వెల్లడించారు. అయితే సోమవారం నుంచి ఇసుక నిల్వలను ప్రజలకు పంపణీ చేస్తున్నారు. రానున్న 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందన్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో తీవ్ర అవకతవకలు జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఇసుక విధానాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 మాత్రమే ప్రభుత్వం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *