వైసీపీ అధినేత జగన్ మళ్లీ టూర్‌కి ప్లాన్ చేశారు. ఈసారి మూడు రోజుల టూర్ వేయబోతున్నారు. మహానేత దివంగత వైఎస్సార్ బర్త్ డే జులై 8న కావడంతో ముందుగానే ఆయన కడపకు వెళ్తున్నారు.
శనివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. ఆరు, ఏడున కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. వైఎస్సార్ బర్త్ డేకు ఎప్పుడూ ఒక రోజు ముందు మాత్రమే వెళ్లేవారాయన. ఈసారి మూడురోజుల ముందు వెళ్లడంపై చర్చించుకోవడం నేతల వంతైంది.
ఇందుకు కారణాలు లేకపోలేదు. హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నా రు. ఈ క్రమంలో తాడేపల్లిలో ఉండే బదులు వైఎస్ఆర్ బర్త్‌డే పేరిట ముందుగానే వెళ్తే బాగుంటుందని ఆలోచించి ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పులివెందుల పట్టణ అభివృద్ధి పనులు చూసే అధికారి సడన్‌గా టీడీపీ సర్కార్ మార్చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచింది. కాంట్రాక్టర్లు వచ్చి నానాయాగీ చేస్తారని భావించి ముందుగా వెళ్తున్నట్లు చెబుతున్నాయి.