నీట్‌ పరీక్ష రద్దు చేయొద్దని కోర్టు మెట్లు ఎక్కిన ర్యాంకర్లు..!

నీట్ వ్యవహరం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. గత కొంతకాలంగా ఈ వ్యవహారం అట్టుడుకుతోంది. తాజాగా, నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయొద్దని నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

పరీక్షను రద్దు చేయకుండా నేషనట్ టెస్టింగ్ ఏజెన్సీని నిలువరిస్తూ ఆ సంస్థకు సంబంధిత ఆదేశాలు ఇవ్వాలంటూ గుజరాత్‌కు చెందిన దాదాపు 56 మంది అభ్యర్థులు కోర్టును కోరారు. నీట్ యూజీలో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులతోపాటు ఫస్ట్ ర్యాంక్ సాధించిన కొంతమంది ఈ పిటిషన్ వేశారు.

 

అంతకుముందు నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.

 

నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో 56 మంది నీట్ పరీక్ష రద్దు చేయొద్దని సుప్రీంకోర్టును ఆశ్రయించి పరీక్షను రద్దు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు నీట్ వ్యవహారంపై 26 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు జులై 8న విచారణ చేపట్టనుంది.

 

తాజాగా, అందిన పిటిషన్ ప్రకారం.. ‘పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయితీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది. విద్యాహక్కు ఉల్లంఘనకు సైతం దారితీస్తుంది. అందుకే నీట్ యూజీని రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్టీఏకు ఆదేశాలివ్వాలి.’ అని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్ కోమ్ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

 

నీట్ పేపర్ లీకేజీలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని కోరారు. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *