మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి..అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వివిధ అంశాలపై చర్చించారు. దీంతో పాటు విభజన హామీలపై కూడా చర్చించినట్లు సమాచారం.

 

అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరిద్దరూ రాష్ట్రానికి రానున్న నిధులపై ప్రధానితో చర్చించిన్నట్లు తెలుస్తోంది.

 

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోదీ రేవంత్ చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *