‘కల్కి’లో కృష్ణుడిగా కనిపించింది ఈయనే..!

కథ, విజువల్స్‌తోపాటు ఊహించని అతిథి పాత్రలతో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతోంది. ఇందులో కృష్ణుడిగా నటించిందెవరా? అనేది నెట్టింట హాట్‌ టాపిక్‌ మారింది. కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడమే ఇందుకు కారణం. స్వయంగా ఆయనే సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆయనే తమిళ నటుడు కృష్ణ కుమార్‌. ‘ఆకాశం నీ హద్దురా’ మూవీలో సూర్య స్నేహితుడిగా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *