కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి యావత్ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. దాంతో చేసేది లేక ఇండోర్‌లోనే రకరకాల ఆట పాటలతో అలరిస్తున్నారు.
దీనిలో భాగంగా ఆస్ట్రేలియా ఓపెనర్ తన కూతుళ్లతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం తన కుమార్తె ఇవీతో కలిసి చేసిన వీడియోకి ఎవరైనా తమకు సహాయం చేయాలన్నాడు. ‘ మాకు టిక్‌టాక్‌పై అవగాహన లేదు. దీనిపై సాయం చేయండి. నా ఐదేళ్ల కూతురి కోసం టిక్‌టాక్ వీడియో చేస్తున్నా. ఇందులో నాకు ఫాలోవర్స్ కూడా లేరు’ అని వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆ వీడియో పోస్ట్ చేశాడు.