కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ధైర్యంగా ఉండాలని అందరికీ #teamananthapuram అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ Gandham Chandrudu దైర్యాన్నిచ్చారు. అనంతపురంలోని శారదా నగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు క్యాన్సర్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చినవారిని పరామర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు సమయానికి చికిత్స అందిస్తున్నారా లేదా, ఇక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం రుచికరంగా ఉందా లేదా తదితర అంశాలపై వారితో మాట్లాడారు.
కోవిడ్ పట్ల ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం అక్కడ వైద్య సేవలు అందిస్తున్న నర్సులను అభినందిచారు. ఆసుపత్రి నిరంతర పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి నందు కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు.