ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్‌ టెస్టుల అనంతరం

: ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను కొవిడ్‌ టెస్టుల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్ గుర్నాథానికి కూడా కరోనా టెస్టులు చేయించినట్లు పోలీసులు తెలిపారు. గుర్నాథానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా ధూళిపాళ్ల నరేంద్ర, ఏ2గా గోపాలకృష్ణ, ఏ3గా గుర్నాథం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. విజయవాడ జిల్లా జైలుకు ధూళిపాళ్ల నరేంద్రను తరలించారు.

 

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక, పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇతరుల సహకారంతో చైర్మన్‌ నరేంద్ర అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన నేరం కావడం, ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయని ఏసీబీ వెల్లడించింది. చైర్మన్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని ఏసీబీ స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఈ కేసులో డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ ఏ1, ఏ2 డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, ఏ3గా ఎం. గురునాథం ఉన్నారని ఏసీబీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *