జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా..?

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు లోకి వచ్చింది. ప్రస్తుతం పులివెందులలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా బెంగుళూరు వెళ్లబోతున్న ట్లు తెలుస్తోంది. అంతేకాదు వీలు కుదిరితే బీజేపీ నేత గాలి జనార్థన్‌రెడ్డితో భేటీ అయ్యే ఛాన్స్ ఉందనేది అసలు సారాంశం.

 

శనివారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. మాజీ సీఎం రాకతో కార్యకర్తలు, అభిమానులు, కాంట్రాక్టర్లు తరలివచ్చారు. కార్యకర్తలతో మాట్లాడి చెప్పాల్సిన నాలుగు ముక్క లు చెప్పి పంపించారు. రోజురోజుకూ నేతలు రావడంతో ఆయన బెంగుళూరు వెళ్లనున్నట్లు సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదు. కొద్దిరోజులు ప్రశాంతతకు కోసం వస్తే.. అక్కడ కూడా కార్యకర్తలు రోజూ రావడంతో చివరకు బెంగుళూరుకు ప్లాన్ చేశారట.

 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు సంబందించి వ్యాపారాలు జోరందుకున్నాయి. సిమెంట్, పవర్, జియో ఇలా పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ లాభాల బాట పట్టాయి. ప్రభుత్వం మారడంతో వాటిపై ప్రభావం పడుతుందని భావించి ఇకపై బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ మిత్రుడు గాలి జనార్థన్‌రెడ్డితో సమావేశమయ్యే ఛాన్స్ ఉందని కడప నేతలు చెబుతున్నమాట.

 

లోక్‌సభ ఎన్నికల ముందు గాలి జనార్థన్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారు. తన మిత్రుడు తరపున ప్రచారం చేశారాయన. ఏపీలో మారిన రాజకీయాల నేపథ్యంలో గాలి ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మరికొందరు మాత్రం కేసు విషయం గురించి మాట్లాడవచ్చని అంటున్నారు. మొత్తానికి జగన్ బెంగుళూరు వెళ్తారన్న వార్త రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. దీనికి గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *