నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

కృష్ణా: నూజివీడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ టెస్ట్, వ్యాక్సిన్‌లకు ప్రజలు క్యూ కడుతున్నారు. నూజివీడులో కోవిడ్ పాజిటివ్ కేసులు 45కు చేరాయి. ఇప్పటివరకు కరోనా కాటుకు బలై 8 మంది మృతి చెందారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరికొందరు రోగులు మృత్యువుతో పోరాడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి ఇళ్లకే పరిమితమైయ్యారు. భయాందోళనలో పట్టణ ప్రజలు ఉన్నారు. ఈ నెల 26 నుంచి వ్యాపార సంస్థల నిర్వహణ వేళలను కుదించి కరోనా కట్టడికి సహాకరించాలని వ్యాపారస్తులను రెవిన్యూ, పోలీసు అధికారులు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *