దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను దూరంగా పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఐఐటీ నిపుణులు సైతం ఈవీఎంలు సేఫ్ అంటూ చెబుతున్నారు. అయినా సరే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
తాజాగా ఈవీఎంల క్రాస్ వెరిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి 8 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులు అప్లై చేశారు.