ప్రేమించిన పాపనికి దళిత యువకుడిని నిర్ధాక్ష్యణంగా చంపేశారని

ఆధునిక కాలం కుల,మత జాడ్యం పెచ్చురిల్లుతుందని ప్రేమించిన పాపనికి దళిత యువకుడిని నిర్ధాక్ష్యణంగా చంపేశారని ఎస్సీ,ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. ఈ దారుణ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్ ముందున్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేస్తూ,వాహనాలు బంద్ చేయడంతో అక్కడికి వచ్చిన నగర డిఎస్పీ వీరా రాఘవ రెడ్డి ఆందోళన కారులు సాకే హరి,దండోరా అక్కులప్ప,చిన్నఅంజినేయులు,ఉదయ్ కుమార్ లను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ..నగర పరిధిలోని చంద్రబాబు కొట్టాల్లో అంకే సూర్య ప్రకాష్ అదే ప్రాంతానికి చెందిన ముస్లీం యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని అయితే మతాలు వేరు కావడంతో మస్లీములు బలవంతంగా అమ్మాయితోనే పోన్ చేయించి సూర్యప్రకాశ్ వచ్చిన తర్వాత పథకం ప్రకారం మారణాయుధాలతో దారుణంగా దాడి చేశారని వాపోయారు.కాలనీ వాసులు అడ్డుపోయిన దౌర్జన్య దాడికి గురై తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేర్చిన పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని అవేదన చెందారు.సూర్యప్రకాశ్ కుటుంబము నిరుపేదలని తండ్రి అంకే చంద్రశేఖర్ పక్ష పాతంతో ఏళ్ళగా ఇబ్బంది పడుతున్నాడని,తల్లి అనారోగ్యం కారణంగా మరణించిడంతో చిన్న తమ్ముడు ఉన్నాడని ఇంటికి జీవనాధారం సూర్యప్రకాశ్ అని ఇప్పుడు కుటుంబం వీదిన పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా నిందితులపై రౌడిషీట్ ఓపెన్ చేయాలని,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరియు ప్రేమించిన యువతికి ప్రాణహాని ఉందని స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారని వారి కుటుంబము నుండి అమ్మాయికి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరువు హత్యలకు అడ్డు కట్టు వేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత,గిరిజనుల మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఘోరాలు జరిగినప్పుడు సానుభూతితో మంత్రాలు వేసి మాయ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అలాగే సూర్యప్రకాశ్ తండ్రి అంకే చంద్రశేఖర్ ను పరమార్శించారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు చంద్రశేఖర్,సాకే నరసింహులు,ప్రతాప్,గణేష్,రామాంజనేయులు,కాలనీ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *