‘కల్కి 2898ఏడీ’ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఇప్పటివరకు మనం మార్వెల్, డీసీ సినిమాలకు సపోర్ట్ చేశాం. ఇక నుంచి KALKI 2898ADని ప్రమోట్ చేద్దాం. బాహుబలితో ప్రభాస్ తెలుగు సినిమా ప్రమాణాలను దేశవ్యాప్తం చేశారు. ఇప్పుడు కల్కితో నేను, ప్రభాస్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటుతాం. ఇది మన ప్రభాస్ సినిమా. మన తెలుగు సినిమా’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.