లాభాలు అక్కర్లేదు.. భారత్‌కు వ్యాక్సిన్ ఇస్తాం.. :US pharma major Pfizer:

కరోనా సెకండ్ వేర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో వ్యాక్సిన్ వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లను దేశంలో పంపిణీ చేయాలని భారత్ భావిస్తోంది.

ఇప్పటికే స్పుత్నిక్‌-వీ భారత్ లో అందుబాటులోకి తెచ్చేందుకు ఒప్పందం జరగగా.. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన ఇంకా కొన్ని వ్యాక్సిన్‌లను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్ లకు అనుమతి ఇస్తుంది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఎటువంటి లాభాపేక్ష లేకుండా భారత్ కు ఇస్తామంటూ ప్రకటించింది ఫైజర్ సంస్థ. 95శాతం సామర్థ్యంతో ఇప్పటికే.. అమెరికా, యూరప్ దేశాల్లో ఉపయోగిస్తున్న ఫైజర్ సామర్థ్యాన్ని పరిశీలించి దేశంలో వినియోగించుకుంటామని చెబుతోంది ప్రభుత్వం.

అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ ప్రభుత్వం, ప్రైవేటు మార్గాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయొచ్చని, కానీ, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని వెల్లడించింది.

లాభాలు చూసుకోకుండా భారత ప్రభుత్వానికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో పేద, మధ్య, ధనిక ఆదాయ దేశాలకు అనుగుణంగా తాము ధరలను నిర్ణయిస్తున్నామని ఫైజర్‌ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌ టీకా ఒక డోసు ధర 19.5డాలర్లు(భారత రూపాయిలలో 1464)గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *