ఐపీఎల్ క్రికెటర్లే కాదు వారి భార్యల సందడి కూడా ఉంటుంది

ఐపీఎల్ క్రికెటర్లే కాదు వారి భార్యల సందడి కూడా ఉంటుంది. కరోనా కారణంగా తాజా సీజన్లలో వారి హాడావుడి తగ్గిన అప్పుడప్పుడు మైదానంలో మెరుస్తునే ఉన్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితిక సజ్దే భర్తతో, తన గారాలపట్టి సమైరాతో కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటోను రితిక సజ్దే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సెల్ఫీ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అలాగే “నా ఇద్దరు పిల్లలు” అంటూ తన భర్తను కూడా తన బిడ్డతో పోల్చింది. ఈ సెల్ఫీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన అభిమాన క్రికెటర్ చిన్న కుటుంబాన్ని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కామెంట్లతో రోహిత్ ఫ్యామీలిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఐపీఎల్‌ 2020 తర్వాత గాయం కారణంగా కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉన్న రోహిత్ ఆసీస్ టెస్ట్ సీరీస్ తర్వాత బీజిగా మారిపోయారు. తాజా ఐపీఎల్‌లో కాస్త విరామం దోరికితే చాలు కుటుంబంతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *