చిత్రంతో మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగా ఎంటర్‌టైన్ చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగా ఎంటర్‌టైన్ చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ దుబాయ్‌లో జరిగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు. చిత్ర బృందంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ వేశారు.

సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన సర్‌ప్రైజెస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. సర్కారు వారి పాట చిత్ర ఫస్ట్ లుక్‌ని మే 31న కృష్ణ బర్త్‌ఢే సందర్భంగా విడుదల చేయనున్నారు. అలానే చిత్ర టీజర్‌ను మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా కృష్ణ, మహేష్ బర్త్‌డే ల సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్స్ అందుతుండగా, ఈ సారి కూడా స్టన్నింగ్ సర్‌ప్రైజెస్ వస్తామని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *