నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం.. 96 ఎంపీ స్థానాల బరిలో 1,717 మంది..

లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభ స్థానాలకు, ఒడిశా అసెంబ్లీలోని 28 స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.

 

తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ లోని మరియు జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి సోమవారం పోలింగ్ జరగనుంది. 96 ఎంపీ స్థానాలకు1717 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఎన్నికలలో దాదాపు 17.48 లక్షల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు కాగా.. 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఎన్నికలు జరగనున్న ఈ 96 స్థానాల్లో 40కి పైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎంపీలు ఉన్నారు.

 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, TMC ఫైర్‌బ్రాండ్ మొహువా మొయిత్రా, AIMIM అసదుద్దీన్ ఒవైసీ వంటి అనేక మంది ప్రముఖ అభ్యర్థుల ఎన్నికల భవితవ్యం లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో తేలనుంది. వీరిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (కన్నౌజ్, యూపీ), కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), నిత్యానంద్ రాయ్ (ఉజియార్‌పూర్, బీహార్), రావుసాహెబ్ దాన్వే (జల్నా, మహారాష్ట్ర) ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

 

కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, టీఎంసీకి చెందిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (ఇద్దరూ బహరంపూర్, పశ్చిమ బెంగాల్), బీజేపీకి చెందిన పంకజా ముండే (బీడ్, మహారాష్ట్ర), ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్, తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (కడప) బరిలో ఉన్నారు.

 

2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేని ఖేరీ (యూపీ) నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు, లోక్‌సభ నుండి బహిష్కరించబడిన టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నుంచి తిరిగి ఎన్నికకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు శత్రుఘ్న సిన్హా అసన్‌సోల్ నుంచి మళ్లీ ఎన్నికవ్వాలని తహతహలాడుతున్నారు., అక్కడ ఆయన బీజేపీ సీనియర్ నేత ఎస్‌ఎస్ అహ్లూవాలియాతో పోటీ పడుతున్నారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, తృణమూల్ కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ బర్ధమాన్-దుర్గాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఓటింగ్ జరగనుంది, ఇందులో అధికార వైఎస్సార్‌సీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో కూడిన ఎన్‌డీఏ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ (పులివెందుల), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (కుప్పం), జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ (పిఠాపురం) తదితరులు అసెంబ్లీ ఎన్నికల రేసులో ఉన్నారు.

 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల (కడప), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (రాజమహేంద్రవరం) తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తోంది. NDA భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా, TDPకి 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలను కేటాయించగా, BJP ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన పార్టీ రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

 

ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

 

ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌లో ఇది మొదటి ప్రధాన ఎన్నికలు. నేషనల్ కాన్ఫరెన్స్ %A