తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎస్ఎస్ సీ బోర్డు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను పదోతరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లో చెక్ చేసుకోవచ్చు.
2023-24 విద్యాసంవత్సరానికి గాను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ టెన్త్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 5 లక్షల 8 వేల 385 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. వీరిలో 2 లక్షల 57 వేల 952 మంది బాలురు అవ్వగా.. 2 లక్షల 50 వేల 433 మంది బాలికలున్నారు. ఇక ఈ ఏడాది నుంచి తెలంగాణ టెన్త్ మార్క్స్ మెమోలపై విద్యాశాఖ పర్మినెట్ ఎడ్యుకేషన్ నెంబర్ (P.E.N) ను ముద్రించనుంది. 11 అంకెలతో ముద్రించే ఈ నంబర్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.