నితిన్ ‘తమ్ముడు’ సినిమాలో రెండో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా వర్ష బొల్లమ్మ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *