కరోనా వైరస్ పోరుపై గుర్తుగా హీరో మంచు మనోజ్‌ పాట


హైదరాబాద్ :  కరోనా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలను సంరక్షించేందుకు అహర్నిశలా శ్రమిస్తున్న డాక్టర్లు, పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బందికి అంకితమిస్తూ మంచు మనోజ్‌ ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటకోసం మనోజ్‌తో పాటు ఆయన మేనకోడలు విద్య నిర్వాణ కూడా గళం విప్పారు. ‘ గుండె సెదిరిపోకురా.. గూడు వదల మాకురా’ అంటూ సాగే ఈ పాట 6 నిమిషాల 11 సెకన్ల నిడివి ఉంది. అచ్చు రాజమని సంగీత అందించిన ఈ పాటకు కాశర్ల శ్యాం లిరిక్స్‌ రాశారు. ఈ పాటపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం’ అన్నారు.
కాగా, మంచు మనోజ్‌ హీరోగా ‘ అహం బ్రహ్మాస్మి’ అనే పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆయన కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత మనోజ్‌ నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కొద్దిరోజులకే లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కు విరామం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *