వైసీపీని తొక్కేద్దాం.. కూటమిని తెచ్చేద్దాం: పవన్ కళ్యాణ్..

ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీని పాతాళంలోకి తొక్కి.. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఏపీలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని జనసేనాని ఆరోపించారు.

 

అన్నమయ్య జిల్లాలో కూటమి అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందని.. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

 

అన్నమయ్య జిల్లాలో 39 మంది చావుకు వైసీపీనే కారణం అని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం ద్వారా డ్యామ్ ప్రమాదంలో పడిందని.. దాని కారణంగా 39 మంది చనిపోయారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

 

అన్నమయ్య జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలను ఘోరంగా ఓడించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీని పాతళంలోకి తొక్కి.. కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే రాజంపేట ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే కూటమి ఏర్పడిందని మరోసారి పవన్ కళ్యాణ్ వెల్లిడంచారు. వైసీపీని చూసి ప్రజలు భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *