తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన..

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పొన్నం పాల్గొన్నారు. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని తెలిపారు.

 

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. బండి సంజయ్, వినోద్ కుమార్ లు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి సంజయ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేదని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసి వృధా చేసుకోకుండా..కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు ఉద్ధేశ పూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేసారు. పేదల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టమని మంత్రి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *