నామినేషన్ల రోజు అధికార వైసీపీ- టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో కేడర్ మధ్య ఘర్షణ..

నామినేషన్ల సందడి ఇంకా మొదలుకాకముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ- టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో కేడర్ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వేదికైంది.

 

డీటేల్స్ లోకి వెళ్తే.. కల్యాణదుర్గం పట్టణంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఇంటి నుంచి వెళ్తుండగా ఈ గొడవ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా దారికి అడ్డంగా వాహనాలను పెట్టారు వైసీపీ కార్యకర్తలు.

 

వాటిని తీయాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య మాటలు కాస్త వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ నేత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్‌బాబుపై దాడికి తెగబడ్డారు వైసీపీకి చెందిన కార్యకర్తలు. దీంతో ఆయన అక్కడిక్కడే పడిపోయారు.

 

రమేష్ తలకు గాయం కావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి ఖండిస్తూ టీడీపీ శ్రేణులు పోలీసుస్టేషన్ వద్ద నిరసన తెలిపాయి. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *