అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు కుర్రాడు..

విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు కుర్రాడిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. NS-24 మిషన్ పేరుతో చెపట్టనున్న అంతరిక్షయాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజన్ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది.

 

వీరిలో వెంచర్ కేపలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ కు చెందిన వ్యాపారవేత్త సిల్వౌన్ చిరోన్, అమెరికా వ్యాపారవేత్త కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికుడు అయిన కరోల్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ లు ఉన్నారు. ఇందులో మన తెలుగువాడు గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టనున్న న్యూ షెపర్డ్ ప్రాజెక్టులో టూరిస్టుగా వెళ్లనున్నారు.

 

ఎవరీ గోపీచంద్ తోటకూర?

విజయవాడలో పుట్టిపెరిగిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత జెట్ పైలట్ గా పనిచేశారు. ఇవే కాకుండా బుష్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు వ్యవహరించాడు కూడా. ప్రస్తుతం ప్రిజర్వ్ లైఫ్ సంస్థ కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అట్లాంటా కేంద్రంగా వెల్ నెస్ సెంటర్ గా ఈ సంస్థ సేవలందిస్తోంది.

 

అంతకముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా స్పేస్ లోకి వెళ్లినవారే. అయితే వారంతా భారత మూలాలు ఉన్న అమెరికా పౌరులు. కాని గోపీచంద్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్నప్పటికి భారత పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *