సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం చెలరేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి సీఎం జగన్ పైకి రాయిని విసిరాడు. దీంతో అతనికి గాయమైంది.

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ పైకి ఓ అగంతకుడు రాయిని విసిరాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటుగా రాయిని కూడా జగన్ పైకి విసిరాడు. రాయి ఫోర్స్ గా జగన్ కు తగలడంతో ఎడమ కన్ను కొద్దిగా వాచింది.

 

విజయవాడలోని సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన అతని సిబ్బంది బస్సులోనే జగన్ కు వైద్య సేవలు అందించారు. అయితే ఈ ఘటనలో మజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైంది. కాగా, చికిత్స అనంతరం బస్సు యాత్ర యదావిధిగా కొనసాగింది.

 

అయితే సీఎం జగన్ కు రాయి తగలడంతో గాయం లోతుగా అయ్యిందని.. రెండు కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆదివారం జగన్ చేపట్టబోయే బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చే యోచనలో వైసీపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బస్సు యాత్ర ద్వారా జగన్ వస్తున్న ప్రజాదరణ చూసిన ప్రతిపక్షం ఓర్వలేకనే ఈ చర్యకు పాల్పడిందిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

 

జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్’ అంటూ టీడీపీ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎలక్షన్స్ సమయం దగ్గరపడుతుండడంతో జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపారంటూ టీడీపీ ఆరోపించింది.

 

అయితే ఈ ఘటనపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాళ్ల దాడిలో జగన్ కు లోతైన గాయమైనట్లు తెలిపారు. దీంతో రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేకనే.. రాళ్ల దాడికి పాల్పడ్డారని అన్నారు. సీఎంపై దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే దాడి చేయించిన వారు ఎవరనే విషయాలు భయటకు వస్తాయన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *