సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో నయాబ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ మహమ్మద్ వాజిద్ తన స్వగృహమునకు పవిత్ర రంజాన్ పండుగను పునస్కరించుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను ఆహ్వానించారు. నయాబ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ మహమ్మద్ వాజిద్ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మధురానుభూతితో కూడిన సోదర భావంతో, స్నేహభావంతో, బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను ఇంటికి ఆహ్వానించి పవిత్ర రంజాన్ పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంలో పవిత్ర రంజాన్ పండుగను పునస్కరించుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మన ఆలోచన విధానం బాగుంటే, మన ఆశయాలు బాగుంటే, విజయం అదంతట అదే వస్తుందని అందుకు ప్రతిరూపకంగా ఆత్మీయ స్నేహితుడైన, సోదరుడైన నయాబ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ వాజిద్ అని పవిత్ర రంజాన్ సందర్భంగా తెలియజేశారు.అదేవిధంగా ఆ అల్లా నయాబ్ డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ వాజిద్ ను సుఖ సంతోషాలతో , దినదిన అభివృద్ధి పథంలో ఉండే విధంగా వారిని వారి కుటుంబ సభ్యులను చూడాలని పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.