భారీగా డ్రగ్స్ సీజ్, ఏడుగురు అరెస్ట్..

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడో దగ్గర డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 

ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు చేసిన దాడుల్లో 5 కిలోల పోపీ స్ట్రా, 1.5 కిలోల ఓపీఎం, 24గ్రాముల హెరాయిన్ వంటి డ్రగ్స్ ఉన్నాయి. నిందితుల నుంచి కంటైనర్, 8 బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి నగరానికి రప్పించారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? డ్రగ్స్ రవాణా వెనుక వెనుకనున్న వ్యక్తులపై కూపీ లాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *