కోనసీమ జిల్లాలోని అంబాజీపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అంటున్నవారికి మరిచిపోలేని యుద్ధం ఇద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
‘కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి.. బాలయోగి చనిపోయినా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారు. బాలయోగి నాకు చిరకాల మిత్రుడు. బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేసిన ఘనత టీడీపీదే. బీసీలకు న్యాయం చేసే బాధ్యత నాది. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి.. చెక్ పెట్టే రోజు దగ్గర పడుతోంది.
ఈ ఐదేళ్లలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా..? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఎవరైనా మంచినీళ్లు అడిగితే.. కొబ్బరినీళ్లు మనస్సు కోనసీమ వాసులది. సిద్ధం అంటున్నవారికి మరిచిపోలేని యుద్ధం ఇద్దాం’ అంటూ చంద్రబాబు కోనసీమ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు కన్నీళ్లు తుడవడమే కూటమి లక్ష్యం. బీసీలకు సాధికారిత రావాలి. కొబ్బరి నీళ్లు ఎంత మాధుర్యంగా ఉంటాయో.. కోనసీమ ప్రజల మనస్సు అంత మాధుర్యాగం ఉంటుంది. జగన్ వచ్చి కొట్లాట సీమగా మార్చేశారు.
ఐదు కోట్ల మంది ప్రజలకు కాపాడడానికే కూటమి ఏర్పడింది. త్రివేణి సంగమంలా టీడీపీ, బీజేపీ, జనసేన పనిచేస్తాయి. కొబ్బరి, వరి రైతులకు నేను అండగా ఉంటాను. రైతు భరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లో ఉన్నాయి.. వాటిని రైతులకు మేలు చేసే విధంగా మార్చుతాను.
కొనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమను తీసుకొస్తాం. అన్నయ్య చిరంజీవి నా మంచి కోరుకునే వ్యక్తి. నేను రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే అన్నయ్య పార్టీకి విరాళం అందించారు. రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలి’ అని పవన్ కోనసీమ ప్రజలకు పిలుపునిచ్చారు. అని పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.