సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ పాషా గారి ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. రంజాన్ పండుగ ను పునస్కరించుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని ఆహ్వానించారు.ఆత్మీయ భావంతో సుఖ సంతోషాలతో అక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో సమయాన్ని గడిపారు. ఈ సందర్భంలో బిసివై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పవిత్ర రంజాన్ పండుగను పునస్కరించుకొని తన స్వగ్రామంలో గల సదాశివపేట పట్టణ ప్రముఖ మైనారిటీ లీడర్లను అలైబలైతో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రముఖ మైనార్టీ నాయకులతో ముఖ్యమైన చర్చలు జరపడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అలనాటి కాలం నుండి హిందూ , ముస్లింలు అన్నదమ్ముల వలె , ఆత్మీయ సోదర భావంతో మెదులుతూ సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగ పవిత్ర రంజాన్ పండుగ అని తెలియజేశారు. ఈ యొక్క రంజాన్ పండగ వేడుకల్లో సదాశివపేట పట్టణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సకినాల కృష్ణ, లింగం, కుశాల్ గౌడ్, నర్సింలు, వెంకట్, భీమన్న, ఫోటోగ్రాఫర్ రాము,జిల్లా బీసీ సంఘం నాయకులు జి శంకర్ గౌడ్, మరియు ప్రముఖ మైనారిటీ లీడర్లు,మహమ్మద్ రియాజ్, మహమ్మద్ లతీఫ్, మహమ్మద్ ఖలీల్ మరియు అధిక సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.