సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ బుధవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని న్యాయమూర్తి సురేష్ ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారని నిందితులు ఇప్పటికే ఒప్పుకున్నారని తెలిపారు.
నిందితులు వెల్లడించిన ఈ సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పై ED PMLA ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అడ్వాకేట్ సురేష్ ఈడీని కోరారు. ఈ కేసులో అసలు నిందితులు ఇప్పటివరకు విచారించలేదన్నారు. ED కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుకాల ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని అన్నారు.
అయితే ఈయన ఈడీకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈడీ రంగప్రవేశం చేస్తే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాజకీయ నాయకుడి మెడకు చుట్టుకుంటుందోనని రాజకీయ చర్చ మొదలైంది.