ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతోందా? మళ్లీ అరెస్టులు మొదలవుతాయా? ఇవే ప్రశ్నలు రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి. తాజాగా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.
తనను ఈడీ అక్రమంగా చేయడంపై ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తీర్పు వెలువడే అవకాశముందని అంటున్నారు. న్యాయ స్థానం తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి ఆఫ్ నేతల్లో నెలకొంది.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. మద్యం కుంభకోణంలో పలుమార్లు ఆయన్ని ఈడీ తమ అదుపులోకి తీసుకుని విచారించింది కూడా. కీలక విషయాలను రాబట్టింది కూడా. ఈ కేసులో ముఖ్యమైన నేతలు అరెస్టు చేయడంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది కీలకంగా మారింది. ఈ క్రమంలో న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లమంటుందా? కేసు విచారణ తర్వాత మళ్లీ పిటీషన్ దాఖలు చేయాలని అంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆఫ్ నేతలను వెంటాడుతున్నాయి.